- బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలాలో విద్యార్థులే కార్మికులయ్యారు
- వంట పనిలో విద్యార్థులు
- ఒక కార్మికుడు చేయవలసిన పనులు విద్యార్థులతో చేపిస్తున్న హెడ్మాస్టర్
- కూలి పని చేసే వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న స్థానిక బ్రహ్మనాయుడు ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్
Head Master: నీరు పేద కుటుంబంలో జన్మించిన పిల్లలు బాలకార్మికులుగా మారకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) నాడు – నేడు (Nadu Nedu) కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా స్కూల్ భవనానికి కొత్త హంగులు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంను జోడించి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం (English Medium)ను అమలు చేసింది. తమ పేదరికాన్ని రూపు మేపేందుకు ఎన్నో ఆశలతో విద్యార్థులు స్కూళ్లకు వస్తుంటారు. బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. మాస్టర్ (Master) చెప్పే పాటలను బుద్ధిగా చదువుకొని ఉతీర్ణులు అవుతున్నారు. ఓ పాఠశాల (School)లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు (Students)..
పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని పల్నాడు బ్రహ్మనాయుడు ఉన్నత పాఠశాల లో హెడ్ మాస్టర్ గా అనంతశివ విధులు నిర్వహిస్తున్నారు. మూటలు మోయాలంటే అందుకు కూలీలు కావాలి. విధ్యార్థులనే కూలీలుగా మార్చాడు హెడ్ మాస్టర్. ఇక్కడ హెచ్ఎం వచ్చిన దగ్గర నుండి పిల్లలతో స్కూల్ గ్రౌండ్ ను ఉడిపించడం, క్లాస్ రూముల్ని శుభ్రం చేయించడం, బరువులు మోపించడం, కోడిగుడ్లు బంగాళదుంపలు ఒలిపించడం ..ఇలాంటి కార్యక్రమాలు పిల్లలతోటి చేపిస్తుంటే ఆ నోటా…ఈ నోటా పాకీ విద్యార్థుల తల్లితండ్రులవరకు ఈ విషయం చేరింది. ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యార్థులను కూలీలుగా మార్చడం ఏంటని ప్రశ్నించారు. తాము చదువుకోడానికి పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నామని… కానీ వారి చేత పని చేయించుకోవడానికి కాదు అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ స్పందించి హెచ్ ఎం పై తగు చర్యలు తీసుకుంటారా .. లేదా .. వేచి చూడాలి.