రంపూడి మండలం ఒప్పిచర్ల కౌలు రైతు పథకంలో భారీ అవినీతి
బినామీ కార్డులు సృష్టించి 30 లక్షల స్వాహా
వాలంటీర్లు, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, సచివాలయ సిబ్బంది, అందదండలతో ఈ అక్రమాలు
పల్నాడు జిల్లా కారంపూడి : ఒప్పిచర్ల ఈ పేరు వెంటనే సంచలానానికి మారుపేరు ఇటీవల ప్రభుత్వ పథకాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఏకంగా గ్రామంలో దండోరా వేపించిన మహోన్నతమైన ఊరు. ఇప్పుడు మరో భారీ కుంభకోణం వెలుగులకు వచ్చింది. వివరాల్లోకి వెళితే కౌలు రైతు పథకంలో భారీ అక్రమాలు ఒప్పిచర్లలో చోటుచేసుకున్నాయి. బినామీ కార్డులను సృష్టించి ఏకంగా 30 లక్షల వరకు స్వాహా చేసినట్లు సాక్షాత్తు ఒప్పిచర్ల గ్రామంలోనే ప్రచారం జరుగుతుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే వాలంటీర్ల సహకారంతో ఇది జరిగిందని, గ్రామంలో గుసగుసలాడుకుంటున్నారు. మరొకవైపు కార్డు ఇచ్చేది రెవెన్యూ కు సంబంధించిన విఆర్వోలు ఒప్పిచర్ల లో1&2 సచివాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు వీఆర్వోలు పనిచేస్తున్నారు. ఇప్పటికే బినామీ కౌలు రైతు కార్డులు సుమారు 100 వరకు బయటపడినట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ముచ్చటగా మూడు శాఖలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా బినామీలకు చెయ్యి అందించినట్లు సమాచారం. అసలు పొలం పని తెలియని వాళ్ళకి కౌలు రైతు కార్డులు ఇచ్చి సొమ్మును వారి అకౌంట్లో జమ చేసి దర్జాగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే ప్రబుద్ధులు ఈ గ్రామంలో ఉన్నారా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అక్రమాలకు ఇక్కడ అధికారులు కూడా అందదండ పూర్తిగా ఇస్తుండడంతో దళారులు కొంతమంది వాలంటీర్లు రాజకీయ ప్రోత్బలంతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమాలను అరికట్టకపోతే రాష్ట్రంలో ఒప్పిచర్ల గ్రామం అక్రమాలలో ప్రథమ స్థానంగా నిలిచే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కౌలు రైతు అక్రమాలపై తాహసిల్దార్ శ్రీనివాస్ యాదవ్ ను వివరణ కోరగా వెంటనే విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు