కర్నూల్ జిల్లా, ఎమ్మిగనూరు : పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో రాయలసీమ జోనల్ సీఈవో అనిల్ కుమార్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా మాజీ బిఎస్ఎఫ్ జవాన్ ఆపరేషన్ విజయ్ మెడల్ అవార్డు గ్రహీత, షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికుడు అంటే సరిహద్దు ప్రాంతంలో కాపు కాసే వ్యక్తి కాదన్నారు. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉత్తమ పౌరుడుగా ఉండి సైనికుడిగా మారవచ్చు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి కూడా మత ప్రమేయం లేకుండా అందరూ దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. .ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతు పిల్లలకు విద్యతో పాటు నైతిక విలువలు, దేశభక్తిని ఉండాలని చెప్పారు. విద్యార్థులకు విద్యా బోధనలో దేశం కోసం బోర్డర్ లో విధులు నిర్వహించే సైనికులు, వారి త్యాగాల గురించి అర్థం అయ్యేవిదంగా చెప్పాలన్నారు. మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము అంటే సరిహద్దులో సైనికులు వల్లనే అని తెలిపారు.. ఇలాంటి కార్యక్రమలు నిర్వహించడంలో భాష్యం యాజనాన్యం ఎప్పుడు ముందుంటుందని చెప్పారు. అనంతరం విద్యార్థులు చేసిన విన్యాసాలు,, పిరమిడ్ ఆకృతి విన్యాసం ఆకట్టుకుంది.. ఆర్మీ జావాన్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అనురాధ , వైస్ ప్రిన్సిపాల్ నాగరాజ్ ల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.