కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో మండల ప్రజా పరిషత్ ఆఫీసు ముందు పారిశుద్ధ కార్మికులు నిర్వాదిక సమ్మెకు సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులను వెట్టిచాకిరికి వాడుతున్నారని సరైన గుర్తింపు లేదని వారికి కనీస వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సరైన వేతనం చెల్లించి నెలవారి జీతం వారి వారి అకౌంట్లో జమ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు, లేనిపక్షంలో వారి కొరకు ఎంతటి పోరాటమైన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతాల అంజి రెడ్డి, సహాయ కార్యదర్శి చుక్కల శ్రీశైలం, మండల నాయకులు కూన మల్లయ్య, బోయిని మల్లయ్య పాల్గొన్నారు.
