కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) కేసులో హైకోర్టు షాకిచ్చింది. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలిపి, పిటిషన్‌లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)కు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలిపింది. పిటిషన్‌లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 12న కేసు విచారణను పూర్తి చేసిన తర్వాత హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (muda) కేసులో తనపై దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆమోదాన్ని సిద్ధరామయ్య ఈ పిటిషన్‌లో సవాలు చేశారు.
గవర్నర్ విచారణ
మంగళవారం మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కేసుపై తీర్పును వెలువరిస్తూ గవర్నర్ ఈ కేసును చట్ట ప్రకారం విచారించవచ్చని హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది. గవర్నర్ ఉత్తర్వు మేరకు ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలన్నారు. గవర్నర్ చర్యలో ఎలాంటి లోపం లేదన్నారు. అంతకుముందు సిద్ధరామయ్య తరపున సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సహా పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. దీంతో పాటు ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు స్నేహమయి కృష్ణ, టీజే అబ్రహం కూడా తమ వాదనలు వినిపించారు.