ఉట్టికే ఎగరలేని అమ్మ అంట, ఆకాశానికి ఎగిరింది అంట..! అలా ఉంది బాబు గారి మాటలు అంటూ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మేనిఫెస్టో అంటూ మహానాడు వేదికగా చంద్రబాబు కొత్త మాయ పెలలు వేస్తున్నాడు జాగ్రత. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశాడా? . 14 సంవత్సరాలు సీఎం గా ఉండి ఇచ్చిన హామీలను ఐదు శాతం కూడా నెరవేర్చలేదు బాబు గారూ మీరు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టో లో చెప్పిన హామీలలో నాలుగు సంవత్సరాల్లోనే 98.4% ఇచ్చిన హామీలు హామీలు నెరవేర్చాం అని చెప్పడానికి గర్వాంగా ఉందన్నారు కాసు మహేష్ రెడ్డి. బాబు గారు హామీలు ఇచ్చేటప్పుడు ఆకాశాలు చూపెడతాడు అరచేతుల్లో సింగపూర్ ను చుపెడతాడు, అదే అమలు చేయండి బాబు గారు అంటే నేలని చూస్తా ఉంటాడు ఇదెక్కడి న్యాయం అని పేదవాళ్ళు అడిగితే వాళ్ల నోరును గట్టిగా మూయిస్తాడు. మహిళలను ఆదుకుంటా అని 2014 లో అక్క చెల్లెలను నమ్మించి తీరా గెలిచాక 14 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని 2014 లో సీఎం అయినా బాబు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ఎగ్గొట్టడం వలన దిగిపోయేనాటికి 2018-2019 ఉన్న డ్వాక్రా రుణాలు మొత్తం 25,571 కోట్లు. YSR ఆసరా పధకం క్రింద 4 విడతల్లో ఇస్తానన్న జగన్ అన్న.. 3 విడతల్లో ఇప్పటివరకు 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు ఇచ్చారు.మిగిలిన బకాయి కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం.