పల్నాడు జిల్లా – పిడుగురాళ్ల : ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తో టోల్ ప్లాజా అధికారుల చర్చలు’జరిపి జూన్ 30వ తేదీలోగా పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పనులు పూర్తి చేస్తామని గురజాల శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డికి టోల్ ప్లాజా క్యూబ్ అధికారులు హామీ ఇచ్చారు. తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే వద్దకు వచ్చి టోల్ ప్లాజా అధికారులు చర్చించారు. ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ అధిక ట్రాఫిక్ తో పిడుగురాళ్ల వాసులు ఇబ్బంది పడుతున్నారని మాట తప్పితే టోల్ ఫీజు ఆపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
