నెల్లూరు జిల్లా : కావలి రూరల్ మండలంలోని చెన్నాయపాలెం సముద్ర తీరంలో పడవలో సరదాగా తిరుగుదామనుకొని వెళ్లిన ముసునూరుకు చెందిన 9 మంది యువకులు.
మధ్యాహ్నం ఫైబర్ పడవను మాట్లాడుకొని ఒకటిన్నర కిలోమీటర్ వెళ్లిన తరువాత పడవ మోటార్ చెడిపోయింది.
దిక్కు తోచని స్థితిలో ఏమి చేయాలో అర్ధం కాక 112 కు కాల్ చేసిన యువకులు.
సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు హుటాహుటిన సముద్ర తీరానికి చేరుకున్నారు.
మరో బోటులో బాధితుల వద్దకు చేరుకొని భరోసా కల్పించి, క్షేమంగా ఒడ్డుకు చేర్చిన కావలి రూరల్ పోలీసులు.
ఆనందభాష్పలతో కృతజ్ఞతలు తెలిపిన 9 మంది బాధితులు. సంతోషంతో ధన్యవాదములు తెలిపిన బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు, ప్రజలు.
వెంటనే స్పందించి 9 మంది ప్రాణాలు కాపాడిన ఎస్సై వీరేంద్ర మరియు సిబ్బందిని కావలి DSP వెంకటరమణ,కావలి రూరల్ CI రాజేష్, జిల్లా ఎస్పీ అభినందించారు