కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత్రిమ కరవును సృష్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బీజేపీతో కలుస్తారని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని… ప్రజావ్యతిరేక పాలన అని మండిపడ్డారు. జీవో 3 ద్వారా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను రద్దు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమకు అనుమతి ఇవ్వకపోయినా జీవో 3 రద్దు కోసం ధర్నా చేసి తీరుతామని తేల్చి చెప్పారు.