కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న చేను, మామిడి తోటను పరిశీలించిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సందర్బంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రెండు రోజులుగా కురుస్తున్న వడ గండ్ల వానకు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో మొక్కజొన్న, మామిడి తోట,పొద్దు తిరుగుడు పంటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిలిందన. పకృతి వైపరీత్యాల వల్ల చేతికచ్చే పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు, బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు నష్టపోతే ప్రభుత్వం కనీసం క్షేత్రస్థాయిలో పంట నష్ట వివరాలు కూడా సేకరించకుండా రైతులకు నష్ట పరిహారం అందించకుండా మోసం చేస్తుంది అన్నారు, ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మార్గం మల్లేశం, నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ నాయకులు ముస్కు ఉపేందర్ రెడ్డి, దేశరాజు అనిల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
