కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో అకాల వర్షం కారణంగా తడిసన వరి ధాన్యం కేంద్రాలను రైతులు,కాంగ్రెస్ నాయకులతో కలిసి డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు,రైతులు వరికోతలు ప్రారంభించి 20రోజులు గడుస్తున్న నేటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులు వచ్చి రిబ్బన్ కట్ చేసి ఫోటోలు దిగి వెళ్లారు తప్ప. ఇప్పటివరకు ఒక కిలో ధాన్యం కూడా కొనుగులు చేయలేదన్నారు, ప్రభుత్వం వెంటనే తడిసిన వరి ధాన్యన్ని ఎటువంటి తరుగు తీయకుండా వెంటనే కొనుగోలు చేయాలని పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు, జిల్లా కలెక్టర్ ని కలిసి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అనంత రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, అల్లూరి శ్రీనాథ్ రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్, గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, మార్గం మల్లేశం, గంప మహేష్,బొడ్డు భూపతి, కయ్యం సంపత్, రాంభూపాల్ రాజిరెడ్డి, కిష్టారెడ్డి,అంజిరెడ్డి, బండి రాములు, నర్సయ్య , మల్లికార్జున్, అనిల్ తదితరులు పాల్గొన్నారు
