కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కౌటాల మండలం తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు రుణమాఫీ కాని రైతులతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ సియం రేవంత్ రెడ్డి నూరు శాతం రెండు లక్షల లోపు రుణమాఫీ పూర్తయింది అనడం హాస్యాస్పదంగా ఉందని, ఈ సంవత్సరపు అతిపెద్ద జోక్ ఇదే అని ఎద్దేవా చేశారు. కౌటాల మండలం ముత్యంపేట గ్రామీణ బ్యాంకులో 40 శాతం మందికి కూడా రుణమాఫీ పూర్తి కాలేదని, ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లెలో కూడా పూర్తిస్థాయి రుణమాఫీ కాలేదని నిరూపించడానికి సిద్ధమని తెలియజేశారు. వెంటనే విజయోత్సవాల పేరిట సమయం వృధా చేయకుండా ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు.