కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ సర్సిల్క్ లోని ఎమ్మెల్యే నివాసంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే రాజ్యాంగాన్ని రచించారని. అయన రచించిన రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అన్నారు.ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ధోనీ శ్రీశైలం, మాజీ ఎంపిపి కొప్పుల శంకర్, దూగుంట రాజన్న, దుర్గం కారు పాల్గొన్నారు.