కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలోని పూరపాలక మున్సిపల్ కౌన్సిలర్ జైచందర్ ఇంటి ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు.
కార్మికులు మాట్లాడుటూ 32 మందికి ఒకరికి 15 వందల రూపాయలు వసూలు చేసి మున్సిపల్ సొసైటీ గ్రూపులలో చేర్చిస్తామని చెప్పిన జైచందర్, ఇప్పుడు నాలుగు సంవత్సరాల గడువులో కూడా ఆ సొసైటీ గ్రూపుల్లో పాలు చేయకపోవడంతో కార్మికులు ఆందోళనకు దిగారు.
ఈ అంశంపై కార్మిక సంఘాలు, మున్సిపల్ అధికారులు ఇంకా స్పందించలేదు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మున్సిపల్ సొసైటీ గ్రూపుల్లో చేరేందుకు డబ్బులు వసూలు చేయడం, మళ్లీ కార్మికులను మోసం చేయడం వంటి సంఘటనలు స్థానిక ప్రజలలో నిరసనకు దారితీస్తున్నాయి.
అంతిమంగా, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించబడే వరకు ఆందోళన కొనసాగించనున్నట్లు ప్రకటించారు.