ఆసిఫాబాద్ జిల్లా : కలెక్టరేట్ ఎదుట గత ఆరు రోజులుగా నిరసన తెలుపుతున్న సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులకు సంఘీభావంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా, సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించకపోవడం అన్యాయమని, వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో శ్రమ దోపిడీకి గురవుతున్న సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సాధక బాధకాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు.
