కొమురం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలో జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ స్థలం కొరకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు శుక్రవారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా
కాగజ్ నగర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రతన్ కుమార్ మాట్లాడుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ పట్టణంలో ఏకైక మున్సిపాలిటీ అయిన ఇప్పటివరకు జర్నలిస్టులకు పత్రిక సమావేశంకు ప్రెస్ క్లబ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ స్థలాన్ని కేటాయించగలరని తెలియజేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ జర్నలిస్టుల కు స్థలం కేటాయించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రనిక్ మీడియా పాత్రికేయులు నీలి సతీష్,నాగేష్, ఈర్ల సతీష్, వెంకన్న, హైమద్ పాషా, యూసఫ్ ఖాన్, నావకాంత్, సునీల్, తదితరులు పాల్గొన్నారు