కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ లో శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శవయాత్ర నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల కేంద్రంలో బస్టాండ్ ఏరియాలో కేంద్ర హోం మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బూస సారయ్య, జిల్లా కన్వీనర్ రాంప్రసాద్, దళిత సంఘాల నాయకులు కుమ్మరిపోచం, దుర్గం రాజన్న, దుర్గం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.