కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్: సిర్పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ లెండుగురె శ్యామ్ రావు మాట్లాడుతూ… సంవత్సర కాలం గడుస్తున్న కాంగ్రెస్ పరిపాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక సమయాన్ని వృధా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ హైడ్రా పేరుతో మూడు నెలల కాలవ్యవధి, మూసి నది పేరుతో సమయాన్ని వృధా చేసి నేడు మళ్ళీ ఫార్ములా ఈ రేసింగ్ నిధుల దుర్వినియోగం అంటూ కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావుని, బదునాం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేపడుతు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల యోగక్షేమలు మరచి సి,బి,ఐ. ఏ,సీ,బీ ని పోలీసుల్ని. అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు పెడుతూ, ఫార్ములా ఈ రేస్ పై నిధుల దుర్వినియోగం అంటూ, రేసింగ్ వలన ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చింది తప్ప ఎక్కడ దుర్వినియోగం జరగలేదని, అన్ని ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ఫరెంట్స్ గా ఉన్నాయని రాష్ట్ర ప్రజలు నిజం గమనిస్తున్నారని. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత మూట కట్టుకున్నది, రాబోయే రోజులలో కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మనోహర్, తదితరులు పాల్గొన్నారు.