కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలో హనుమాన్ దేవాలయం నుంచి మార్కెట్ వీధుల గుండా బంగ్లాదేశ్ లో హిందువులు, హిందూ మత సంస్థలపై దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు. నిరసన ర్యాలీలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ .. స్వామి చిన్మాయానంద దాసను అరెస్టు చేయడం, బంగ్లాదేశ్ లోని దేవాలయాలను ధ్వంసం చేయడం,హిందువులపై దాడులు చేయడం, హిందూ మత సంస్థలపై అనేక అఘాయిత్యాలకు ఒడికట్టడం దారుణమన్నారు. వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం దాడులను అరికట్టాలని, హిందువుల మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, మరియు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.