కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ బిసి బాలకాల వసతి గృహంలో బీఎడ్ విద్యార్థిని తొర్రే వెంకటలక్ష్మి (19) తీవ్ర అస్వస్థతతో. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలు చూసినట్లయితే .. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి బీ.ఎడ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న వెంకటలక్ష్మి గత వారం రోజుల క్రితమే జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో చేరిందని ఈ క్రమంలో హాస్టల్ లో మధ్యాహ్న భోజనం అనంతరం ఆమె అస్వస్థతతో శ్వాస సమస్యతో ఇబ్బంది పడిందని, హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు హుటాహుటిన అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.