కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెనుకబడిన తరగతుల బాలిక వసతి గృహం ఉంటూ స్థానిక శ్రీనిధి డి.ఎడ్ కళాశాలలో యందు రెండవ సంవత్సరం చదువుతున్న తోర్రం వెంకటలక్ష్మి (19) బెజ్జూర్ మండలం గ్రామం అందుగుల గూడ. హాస్టల్ లో మధ్యాహ్నం భోజనం అనంతరo ఆమె అస్వస్థతతో శ్వాస సమస్యతో ఇబ్బంది పడడంతో అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు. వసతి గృహం అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు గ్రామస్తులు శవంతో స్వగ్రామంలో ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి గ్రామంలో ఉద్రిక్తతవాతావరణం ఏర్పడింది. బిఆర్ఎస్ నాయకులు మద్ధతు పలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కుటుంబాన్ని ఆదుకొని కుటుంబానికి రూ. 10 లక్షలతోపాటు, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ తరలించి అరెస్టు చేశారు. సంఘటన స్థలాన్ని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, తాసిల్దార్ భుమేశ్వర్, సంఘటన స్థలం సందర్శించి, నివేదికను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి మృతి పై ఒక కమిటీ వేస్తామని తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. అనంతరం విద్యార్థినీ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.