కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్‌నగర్ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మొదటి రోజు ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన మహోత్సవము లో వేదపండితులచే మంగళ వాద్యల మధ్య వేద స్వస్తి వాచనములతో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, భద్ర మండల దేవత స్థాపన పూజలు, హోమములు, జలాధివాసము, మూల విరాట్టుకు అష్టోత్తర వితరణ, 108 కలశాలతో అభిషేకం, నిర్వహించారు. ఈ కార్యక్రమనికి కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుటుంబ సమేతంగా వచ్చి అష్టోత్తర ధ్వజస్తంభంపై అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ అయ్యప్ప గురు స్వాములు నాగేందర్, బిక్షపతి శ్యామ్ రావు, మూర్తి, రమేష్ మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపటి కార్యక్రమంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉంటుందని అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు తెలియజేసారు.