కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా , కాగజ్ నగర్ : కాగజ్ నగర్ రూరల్ పోలీస్ పరిధిలోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. బోరిగావ్ గ్రామ శివారులోని చెట్ల పొదలలో పేకాట ఆడుతునరాన్న పక్క సమాచారం మేరకు కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్, సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 5,500 రూపాయల నగదు, ఐదు బైకులను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని ఎస్సై సందీప్ తెలియజేశారు.
