కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఈస్గాం : సత్సంగ్ స్థాపకులు శ్రీ శ్రీ అనుకుల చక్రవర్తి ఠాగూర్ స్మారకార్థం ఈస్గాం క్యాంప్ నెంబర్ 7 లో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేడుకలు జరిపిన సందర్భంగా, బిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఠాగూర్ వైద్యునిగా మురికివాడల్లో నివసించే పేదలకు ఎంతో సేవ చేశారని గుర్తుచేశారు. సత్సంగ్ స్థాపకులు మరియు ఆధ్యాత్మిక గురువుగా పేరు సంపాదించారని కొనియాడారు. ఠాగూర్ సేవలు ఎంతో అనుసరనీయమని తెలిపారు. ఆయనను ఆధునిక యుగం యొక్క ప్రవక్త అని పిలుస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆశీస్సులు పేదలందరిపై ఉండాలని అన్నారు.