కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూరు మండలంలోని లంబాడిగూడ, సలుగుపల్లి, రెబ్బెన గ్రామాలలో నాటుసారాయి స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 40లీటర్ల నాటుసారాయిని స్వాధీన పరచుకుని, ఏడుగురి పై కేసులు నమోదు చేసి 800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. నాటు సారాయి, గంజాయి వలన కలిగె దృష్ప్రభావాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు,14 మంది నేరస్తులని తహశీల్దార్ భూమేశ్వర్ వద్ద బైండోవర్ చేసినట్టు కాగజ్ నగర్ ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు భానంద్, సురేష్, ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
