కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కౌటాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో ప్రజా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయ్యాలి అని అన్నారు. అనంతరం మండల కేంద్రంలో వరసంతలో ప్రజా సౌకర్యార్థం 3.5 లక్షలతో టాయిలెట్స్ నిర్మాణానికి భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు అర్షద్ హుస్సేన్, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు