కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : పెంచికల్ పేట్ మండలం మారుమూల ప్రాంతం కమ్మార్గాం లో 5 రోజుల నుండి నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీ విజేతలకు నేడు బహుమతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలని యువత చేడు వేసనలకు దూరంగా ఉండాలని సూచించారు. కమ్మర్గం యువకులు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్సీ కి వివరించగా అతి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బెజ్జురు నుండి కమ్మార్గం వరకు బస్ నడిచేలా రోడ్ సౌకర్యం చేసినందుకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన మొర్లిగూడ జట్టుకు మొదటి బహుమతి 15000 రూ” షిల్డ్, రెండవ బహుమతిగా కామ్మర్గం జట్టుకు 10000 రూ” షీల్డ్ అందజేశారు.
కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు అర్షద్ హుస్సేన్, మాజీ సర్పంచ్ మధునయ్య తదితరులు పాల్గొన్నారు
