కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూరు మండలములోని బారెగూడ గ్రామానికి చెందిన అమ్మాయి (16) సం” అదే గ్రామానికి చెందిన అబ్బాయితో బాల్య వివాహం చేయడానికి ఏర్పాట్లు చేయగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆపరేషన్ స్మైల్ 11 లో భాగంగా కాగజ్ నగర్ డివిజన్ టీం సహాయంతో బాల్య వివాహాన్ని అడ్డుకొన్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సంధర్బంగా ఆపరేషన్ స్మైల్ టీం ఇన్చార్జి ఎస్సై దుర్గం.రాజయ్య మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని,అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహలు చేయాలని సూచించారు. అనంతరం అమ్మాయిని బెజ్జుర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అరుణ, ఐసీడీఎస్ సూపర్ వైజర్స్ కరుణ, సత్య, జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్, ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్ ఝాన్సి రాణి, పోలీసు సిబ్బంది మౌనిక, విజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
