కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్ నగర్ : పురాణాల కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్న మహాకుంభమేళా సంస్కృతి సాంప్రదాయాలకు ఆధ్యాత్మికత అని ఎమ్మెల్సీ దండే విటల్ అన్నారు. గురువారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండ విట్టల్ నివాసంలో కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గజ్జల.సురేష్ కుంభమేళా తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్సీ దండ విట్టల్ కు అందించారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు ఆధ్యాత్మికతే కుంభమేళా అని వివరించారు. ఈ మహా కుంభమేళా ప్రపంచానికే మహత్తర పండుగగా నిలుస్తుందన్నారు. 12 ఏళ్లకు ఒక్కసారి భక్తజన కోటిని సంతరిస్తూ శివరాత్రి దాకా 45 రోజులపాటు భక్తజన పారవశ్యంతో ఈ ప్రాంతం చూడముచ్చటగా ఉంటుందన్నారు. మహా కుంభమేళలో ముఖ్యమైనది పవిత్ర నది స్థానం కోట్ల మంది గంగ, యమునా, సరస్వతి సంగమంలో పుణ్య స్థానాలు చేస్తారని ఈ మూడు నదుల త్రివేణి సంఘమంగా తీర్థ రాజ్యాంగ పేరుందిన ప్రయోగ్ రాజ్ ఇందుకు వేడుకగా నిలుస్తుంది అన్నారు. కుంభమేళాలో తీర్థ ప్రసాదాలను అందించినందుకు ప్రముఖ వ్యాపారవేత్త గజ్జల.సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు
