కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్‌నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో నివసిస్తున్న సామంతుల శ్రీనివాస్, రాణీ దంపతుల రెండవ కుమార్తె అయిన సామంతుల కావ్య ఈ సంవత్సరం విడుదలైన పీజీ పరీక్షల ఫలితాలలో ఎండీ అనస్థీషియా లో 622 గ్రేస్ మార్కులు సాధించి తెలంగాణ టాపర్ గా నిలిచింది. గాంధీ మెడికల్ కాలేజ్ లో పీజీ పూర్తి చేసింది. కాగా వీరి మొదటి కుమార్తె నవ్యకు అప్పటి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ కొలువు సాధించింది. కాగా తండ్రి శ్రీనివాస్ ఆర్టీసీ లో ఉద్యోగం చేస్తుండగా, తల్లి రాణి గృహిణి. తెలంగాణ టాపర్ గా నిలిచిన కావ్యను కాలనీవాసులు, మిత్రులు, అభినందనలు తెలిపారు.
