కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండలంలోని బారేగుడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రమును సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల ఐఏఎస్ సందర్శించి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. తధనంతరం ఎంపీడీఓ కార్యాలయములో జరుగుతున్నటువంటి సర్వే డేటా ఎంట్రీను పరిశీలించి నిర్నీత గడువులోపు పూర్తిచేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయం, ఆశ్రమ పాఠశాల లను సందర్శించి వంటగదులను, త్రాగు నీరు గదులను పరిశీలించి పిల్లలకు నాణ్యత గల ఆహారాన్ని అందించాలని సంబంధిత పాఠశాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ భూమేశ్వర్,ఎంపీడీఓ గౌరీ శంకర్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.