contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అటవీ సిబ్బంది క్వార్టర్ ఏర్పాటు :ఎమ్మెల్సీ దండే విఠల్

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా :  అటవీ సిబ్బంది కొరకు క్వార్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని శాసన మండలి సభ్యులు దండే విఠల్ అన్నారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా బుధవారం అటవీ శాఖ కాగజ్ నగర్ డివిజన్ పెంచికల్ పేట రేంజ్ ఫ్రంట్ లైన్ సిబ్బంది కొరకు ఏర్పాటు చేసిన క్వార్టర్ ను జిల్లా అటవీ అధికారి నీరజ్ టేబ్రివాల్ తో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా శాసన మండలి సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అటవీ శాఖ సిబ్బంది సంక్షేమం కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని,ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :