కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా : ఈ రోజు తెల్లవారుజామున సిర్పూర్ (టి) పోలీసు స్టేషను పరిధిలోని హుడికిలి చెక్ పోస్ట్ వద్ద సిర్పూర్ నుండి మహారాష్ట్ర వైపు బొలెరో వ్యాన్ లో సుమారు 30 క్వింటాళ్ళ రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ రేషన్ బియ్యం విలువ సుమారు 1 లక్ష 8 వేలు ఉంటుందని, హుడికిలి గ్రామానికి చెందిన కిర్మిరే తరుణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ తెలిపారు.