సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సతీసమేతంగా హస్తిన చేరుకున్న కేసీఆర్..మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నేడు ఆయన దివంగత దళిత నేత, కేంద్ర మాజీ మంత్రి బాబూ జగ్జీవన్ రామ్‌ను గుర్తు చేసుకున్నారు.
మంగళవారం బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి, ఈ సందర్భంగానే జగ్జీవన్ రామ్‌ను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. దళితుల అభ్యున్నతికి పాటు పడిన నేతగా జగ్జీవన్ రామ్‌ను కీర్తించిన కేసీఆర్.. ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో దళితుల ఉన్నతికి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేసీఆర్ ప్రస్తావించారు. రాష్ట్రంలో దళితుల ఉన్నతి కోసం దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధును అమలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ పథకం అమలు విషయంలో తమకు చిత్తశుద్ధి ఉందని కూడా కేసీఆర్ చెప్పారు.