హైదరాబాదు హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఆవిష్కరించారు. బౌద్ధ మత గురువులు ప్రార్థనలు చేస్తుండగా, రాజ్యాంగ నిర్మాత భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.
ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, పువ్వాడ తదితరులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు.