contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేసీఆర్ ఓటమి .. ఆలోచనలో పడ్డ జగన్

  • తెలంగాణ లో జరిగిన వన్డే మ్యాచ్ కి సంబంధించి ఏపీ లో 20 20 ఆడనున్న సీఎం జగన్
  • 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు అనుమానమే…
  • సిట్టింగ్ ఎమ్మెల్యేలే కెసిఆర్ కొంపముంచారు…
  • తెలంగాణ ఫలితాలతో అప్రమత్తమైన జగన్
  • ప్రజా వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషణ…
  • డౌట్ ఉన్న అభ్యర్థులకు నో చెప్పనున్న వైసీపీ అధినేత..

 

తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సిట్టింగ్ లకే అవకాశం ఇవ్వడం.

సీఎం కేసీఆర్ 2018 లాగానే దాదాపు సిట్టింగ్ లందరికీ టికెట్ ఇచ్చారు. ఇదే పార్టీ దెబ్బ తీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

కొందరు ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వారికి సీట్ ఇచ్చారు. అలాగే కేసీఆర్ తీరు కూడా కొంత మంది మేధావులు జీర్ణించుకోలేకపోయారు.

ఆంధ్రా కాంట్రక్టర్లే తెలంగాణ సొమ్మంతా తింటున్నారని తిట్టిన కేసీఆర్.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వారికే కాంట్రాక్టులు ఇచ్చారు. చాలా మంది ఉద్యమకారులను పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కపాదంతో అణిచివేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారు. దీన్ని తెలంగాణ సమాజం గమనించింది. తెలంగాణను కేసీఆర్ కుటుంబం చేతిలో చెక్కిందని చాలా మంది ప్రజలు బలంగా నమ్మారు. అందుకే బీఆర్ఎస్ ను ఓడగొట్టారు.

ఆలోచనలో పడ్డ జగన్..

ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువగా సీట్లు ఇచ్చి కెసిఆర్ సీఎం కుర్చి కోల్పోవడం పై సీఎం జగన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది…

తెలంగాణ ఫలితాలు దృష్టిలో పెట్టుకొని టికెట్ల పంపిణీలో జగన్ నిర్మొహమాటంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది…

50 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు పైగా ఈసారి నో చెప్పనున్నట్లు సమాచారం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :