నల్గొండ జిల్లా : మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు వారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వీరిని వీటీ కాలనీ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ‘కేటీఆర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ వీపులకు గో బ్యాక్ కేసీఆర్ అనే స్టిక్కర్లు అంటించుకున్నారు.
