- గాంధీజీ కలలు కన్నా పల్లె సీమల ప్రగతి బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం.
- 60 సంవత్సరాల లో జరిగని అభివృద్ధి 9 సంవత్సరాలలో చేసి చూపింది ముఖ్యమంత్రి కేసీఆర్.
- మళ్లీ దీవించండిమరింత అభివృద్ధి సాధించి చూపిస్తాం.
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపింది బిఆర్ఎస్ పార్టీ నే.
- మహిళా సహాధికారతే ముఖ్యమని మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ: బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాలలో మంగళవారం రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ మరియు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ అభివృద్ధి పర్యటన చేపట్టారు. మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గృహ లక్ష్మీ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందించడం జరిగింది. తదనంతరం బేగంపేట గ్రామంలో నిర్మించిన ఆనందయ్య మఠం వ్యాపార సముదాయ భవన ప్రారంభోత్సవంలో పాల్గొని, బేగంపేటలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా గ్రామాల అభివృద్ధి ముఖ్యమంత్రి కెసిఆర్ సుసాధ్యం చేశారని, 60 సంవత్సరాల వివిధ పార్టీల పరిపాలనలో కానటువంటి అభివృద్ధిని 9 సంవత్సరాలలో అన్ని రంగాలలో గ్రామాలను అభివృద్ధి చేసి చూపించిన ఘనుడు కెసిఆర్ అని కొనియాడారు. మహిళా సహధికారత కోసం మహిళలు సర్వతోముక అభివృద్ధి చెందడానికి అనేకమైన సంక్షేమ పథకాలను అందిస్తూ. మహిళా రక్షణ వ్యవస్థ కోసం “షీ టీమ్స్” తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి మహిళలకు పటిష్టమైనటువంటి చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వమని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం అనేకమైనటువంటి పథకాలను ప్రవేశపెడుతూ మహిళ అభ్యున్నతికి పాటుపడుతూ, మహిళల యొక్క అవసరం దేశానికి ఎంతో అవసరమని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ముందు నుండి ప్రతిపాదిస్తూ బిల్లుకు పార్లమెంటు లో మద్దతు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీతా కార్మికులకు, నేతన్నలకు సబ్బండవర్ణాలకు అండగా నిలుస్తూ వారికి బ్రతుకుపై భరోసాను ఇస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. దళితులను ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టి, కులవృత్తులను ప్రోత్సహించడం కోసం బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారి వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్న కెసిఆర్ ని హ్యట్రక్ పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో బేగంపేట్ గ్రామ సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి, బెజ్జంకి మండల మాజీ ఎంపీపీ చింతలపెల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మానకొండూరు అభివృద్ధితో పాటు, మన గ్రామాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి “అభివృద్ధి ప్రదాత “డాక్టర్ రసమయి బాలకిషన్ కు మళ్లీ పట్టం కట్టాలని బేగంపేట ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, జెడ్పిటిసి కనగండ్ల కవిత తిరుపతి, స్థానిక ఎంపిటిసి పోతిరెడ్డి స్రవంతి మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ జంగిటి శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ జిల్లా కార్యవర్గ సభ్యులు ఐల పాపయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు చంద్రకళ రాజయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడాల లక్ష్మణ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, సోషల్ మీడియా ఇంచార్జ్ ఎల శేఖర్ బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బెజ్జంకి శంకర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, బిఆర్ఎస్ యువజన నాయకులు కొరివి తిరుపతి,బుర్ర అంజి, బండి శ్రీనివాస్, ముత్యాల వెంకటరెడ్డి, మెరుగు రజనీకాంత్, బెజ్జంకి సతీష్, రాజుగాని పవన్, జనగం కుమార్, బిగుల మోహన్, బిగుల్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.