కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: గన్నేరువరం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతులకు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్. రసమయి బాలకిషన్ చిత్రపటాలకు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో పాలాభిషేకం, బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, ఆర్.బి.ఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి హాజరై మాట్లాడారు రైతు బాంధవుడు కెసిఆర్ రుణమాఫీతో మరోసారి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బూర వెంకటేశ్వర్, వివిధ గ్రామాల సర్పంచులు పీచు చంద్ర రెడ్డి , కుమ్మరి సంపత్,అట్టికం శారద శ్రీనివాస్,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నక్క దామోదర్, బిఆర్ఎస్ నాయకులు బోయిని కుమార్, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూన చంద్రశేఖర్, గ్రామ శాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్, మాల మహానాడు మండల అధ్యక్షుడు హనుమండ్ల మల్లేశం, నాయకులు అట్టికం రవి,తదితరులు పాల్గొన్నారు.
