contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నేతలు

నిజామాబాద్ : ఆర్మూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(BJP), భారతీయ జనతా యువమోర్చా(BJYM) ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడమైనది.ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ మాట్లాడుతూ…..

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ కెసిఆర్ పిచ్చి తుగ్లక్ పాలన కారణంగా యువత జీవితాలతో ఆడుకుంటూ తొమ్మిదేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేయకుండా ఇచ్చిన నోటిఫికేషన్ పరీక్ష పేపర్లను సైతం కాపాడుకోలేక టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినటువంటి దుర్మార్గులను వదిలేసి టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ పై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి నాన్ బేలబుల్ కేసులు పెట్టడాన్ని బిజెపి మరియు బీజేవైఎం ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండించింది.

“నిధులు, నీరు, నియామకాల” కొరకు ఏర్పడ్డటువంటి తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో కేసిఆర్ చెలగాటమాడుతున్నాడని. వారికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి న్యాయం కోసం పోరాడుతుంటే అక్రమంగా అరెస్టులు చేసి కేసులు బనాయించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు కుక్కలేమైనా కరిచాయా అన్నట్లుగా కేసీఆర్ యొక్క పాలన పిచ్చి తుగ్లక్ పాలన కన్నా ఘోరంగా ఉందని. బీజేవైఎం కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేసి వారిపై బనాయించినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలని. అదేవిధంగా ఈ టీఎస్పీఎస్సీ ఘటనపై వెంటనే సిబిఐతో గానీ, సిటింగ్ జడ్జితో గాని ఎంక్వయిరీ చేయించి వెంటనే ఈ ఘటనతో సంబంధమున్నటువంటి ఎంతటి స్థాయి వ్యక్తులనైన వదలకుండా కఠినంగా శిక్షించాలని. ప్రతి యువకుడు, ప్రతి నిరుద్యోగి గంటల తరబడి పుస్తకాలతో కుస్తీలు పడి తీరా పరీక్షల సమయంలో పేపర్లు లీకు కావడంతో ఎంతో నిరుత్సాహానికి, ఆత్మన్యూనతకు గురవుతున్నారని. తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని. ఇలాంటి యువకులను విస్మరించడం సమంజసం కాదని. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కేసీఆర్ కు తన కూతురు పై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై కూసంతైన లేకపోవడం కెసిఆర్ దిగజారుడు తనానికి నిదర్శమని. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేపర్ల లీకేజీ దుర్మార్గులను కఠినంగా శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలని. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయమై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం ఖాయమని. అంతేకాకుండా రాబోయే కాలంలో ఈ యువకులే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు,ప్రజాప్రతినిధులకు హెచ్చరించడమైనది.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు విజయానంద్, బిజెపి సీనియర్ నాయకులు భూపేందర్, సైవే రాజ్ కుమార్, బిజెపి ఆర్మూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ బ్యావత్ సాయికుమార్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఉదయ్ గౌడ్, పసుపుల సాయికుమార్, ఉపాధ్యక్షులు పెరంబదూర్ వాసు, సాయినాథ్ రెడ్డి, కార్యదర్శి రెడ్డిబోయిన మూర్తి, దళిత మోర్చ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్, ప్రధాన కార్యదర్శి బ్యావత్ ప్రవీణ్ కుమార్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మిర్యాల్కర్ కిరణ్, కార్యదర్శి బట్టు రాము, ఆర్మూర్ పట్టణ గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు గుగులోత్ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :