ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆరేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో వీధిలో ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఈ మేరకు ఎస్సై బి.కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరాముని తండాకు చెందిన మైనర్ మాలోతు వినోద్ (16) అదే గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల బాలికపై ఎవరూ లేని సమయంలో లైంగిక దాడి చేశాడు. అయితే పక్కనున్న ముసలమ్మ చూసి తల్లికి చెప్పడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లి అక్కడకు చేరుకుంది. ఆమెను చూసి వినోద్ పరారయ్యాడు.
ఈ సమాచారం తెలుసుకున్న తల్లాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితున్ని అదుపులో తీసుకున్నట్లు సమాచారం.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.