కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023 లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ,ఎస్.బి.ఎం కిషన్ స్వామి,ఎంపీడీఓ స్వాతి, ఎంపీఓ పీవీ నర్సింహా రెడ్డి. ఖాసీంపేట గ్రామాన్ని సందర్శించి ఇంకుడు గుంతలు, మరుగుదోడ్ల వాడకునే విధంగా అవగాహన కల్పించడం, గ్రామంలో జరుగుతున్నా సానిటషన్ పనులను, స్కూల్ టాయిలెట్స్ సందర్శించడం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి- వెంకన్న, పంచాయతీ కార్యదర్శి ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు.