కరీంనగర్ జిల్లా: జిల్లా నుండి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023 లో జాతీయస్థాయి పోటీలో పాల్గొనేందుకు గన్నేరువరం మండలం లోని ఖాసీంపేట 2000 జనాభా కేటగిరీలో ప్రతిపాదించబడినందున దీనిని పరిశీలించుటకు కేంద్ర బృందం పక్షాన ఇఫ్ పస్ సంస్థ నుండి కిషోర్ నేతృత్వంలో బృందం ప్రత్యేక పరిశీలన చేయడం జరిగినది, పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం, వినియోగ, అంగన్వాడి, ఆరోగ్య ఉపకేంద్రం, వారసంత, దేవాలయం,తదితర సంస్థలలో పరిశుద్ధ్య సౌకర్యం, వివరాలను స్వయంగా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగినది,
అంతేకాకుండా గ్రామంలోని ఎస్సీ,ఎస్టీ,బిసి,ఓసి, గృహాలను పరిశీలించి మరుగుదొడ్ల వినియోగం తడి పొడి చెత్త లను వేరు చేయుట ఇంకుడు గుంతల వినియోగం పరిసరాల పరిశుభ్రతలను పరిశీలించి ఫోటోలు వీడియోలు ద్వారా ఆన్లైన్లో స్వచ్ఛభారత్ వెబ్సైట్లో నమోదు చేయడం జరిగినది. తర్వాత కంపోస్ట్ షెడ్డు పరిశీలించి పొడి చెత్త నుండి ఆదాయం తడి చెత్త నుండి ఎరువు తయారు చేయు విధానం పరిశీలించడం సామూహిక ఇంకుడు గుంతలు తదితర వసతులను పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి,ఎంపీఓ పీవీ నరసింహారెడ్డి, సర్పంచ్ గంప మల్లేశ్వరి- వెంకన్న, ఉపసర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి,యూనిసెఫ్ సమన్వయకర్త కిషన్ స్వామి,ఎస్.బి.ఎం సమన్వయకర్తలు రమేష్, వేణు,పంచాయతీ కార్యదర్శులు ఆనంద్,అజయ్ ఫెసిలిటేటర్ రవీందర్ సిఓ శేఖర్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.