స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత నెల, నవంబర్ లో మంగళగిరి మండలం నిడమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అండర్ 14 బాల బాలికల ఖోఖో ఉమ్మడి గుంటూరు జిల్లా జట్లు ఎంపికలు జరిగాయి. ఇందులో భాగంగా కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న షైక్. మహీ మున్నిషా ఉమ్మడి గుంటూరు జిల్లా బాలికల జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లలితా తెలిపారు. మహీ మున్నిషా ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు చిత్తూరు జిల్లా లోని బంగారుపాలెంలో జరుగు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటుందని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు చిన్న రత్తయ్య తెలియజేశారు. సోమవారం పాఠశాలలో విద్యార్థినీకి జరిగిన అభినందన సభలో గ్రామ సర్పంచ్ ఇరికిదెండ్ల. రమణ కొండలు, విద్యాకమిటి చైర్మన్ అన్నపూర్ణ, గ్రామ పెద్దలు,ఉపాధ్యాయని ఉపాధ్యాయులు ఆషా, దుర్గాదేవి, నిర్మల, రామాదేవి, రఫి, అంజిరెడ్డి,బాలరామ్, హనుమంతురావు, కిరణ్ కుమారి, సీతా మహాలక్ష్మి, సునీతా, వెంకాయమ్మ, సంధ్యా మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.