సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రోడ్ల మల్లేశం ను బుధవారం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి నాయిని నరసింహారెడ్డి నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ “రైతే రాజుగా ” చెప్పుకునే కెసిఆర్ ప్రభుత్వం కేవలం రైతుబంధు పేరున, ఎకరాకు రైతులకు రావలసిన 15వేల విలువైన పనిముట్లు, ఎరువులు, విత్తనాలు, డ్రిప్స్, వంటి వాటికి ఎగనామం పెట్టి ఏలుతున్నాడని విమర్శించాడు.
వడ్ల కొనుగోలులో మిల్లర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై రైతులను నూక పేరుతో క్వింటాలుకు 10 కిలోలు కటింగ్ చేస్తూ… వడ్లు కొనుగోలు చేసిన 20 రోజుల తర్వాత కటింగ్ చేసిన విషయాన్నిరైతులకు చెబుతున్నారు.రానున్న రోజుల్లో రైతు మోసకారి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో రైతులే కలుపుతారనిపేర్కొన్నారు.కాగా మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించబడ్డ రోడ్ల మల్లేశం తన నియామకానికి సహకరించిన పొన్నం ప్రభాకర్, కవ్వం పెల్లి సత్యనారాయణ, తూముకుంట నర్సిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్ కిధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు శనగొండ శ్రావణ్ కుమార్, ధోనివెంకటేశ్వరరావు, గుడెల్లి శ్రీకాంత్, శీలం నర్సయ్య, బండిపెల్లి రాజు, గుండ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.