కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీలో భాగంగా పట్టణము లోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయము వరకు ర్యాలీని నిర్వహించారు. తదనంతరం మున్సిపల్ కార్యాలయము లోని మెడికల్ క్యాంపును, పట్టణంలోని బీసీ హాస్టల్ ను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయములో జరుగుతున్నటువంటి సర్వే డేటా ఎంట్రీను పరిశీలించి త్వరితగతినా డేటా ఎంట్రీను పూర్తిచేయాలనీ సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి , కాగజ్ నగర్ డివిజన్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల , మున్సిపల్ కమీషనర్ అంజయ్య , తహసీల్దార్ కిరణ్ , ఎంపీడీఓ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
