పిఠాపురం : సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర వర్షిణికి కౌన్సిలర్ అల్లవరపు నగేష్ రెండు పిర్యాదులు అందజేశారు. అందులో మొదటిది పిఠాపురం పట్టణంలో ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ కి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టేశారని, దానివల్ల పర్యావరణానికి ముప్పు అంతే కాకుండా దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ మధ్య పిఠాపురం మెయిన్ రోడ్డులో బస్ స్టాప్ పైన గాలిలో ఫ్లెక్సీలు పెట్టారని, అవి గాలికి విరిగి ప్రజలు పైన పడే విధంగా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించి, ఫ్లెక్సీలు క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తరువాత ఆంజనేయ స్వామి ఆలయం వెనుక పురపాలక సంఘం స్థలం ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులు నాలుగు షాపులు కట్టడం జరిగిందన్నారు. అవి పురపాలక సంఘం అధికారులు తమకు తెలియదు అని చెప్పటం శోచనీయమన్నారు. అందుకే వాటి పైన కూడా పి.జీ.ఆర్.ఎస్ లో పిర్యాదు చేయటం జరిగిందన్నారు.
