కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అంత్యంత వైభవంగా శకటోత్సవం జరిగింది. శకటోత్సవంలో భాగంగా గ్రామస్తులు ఎడ్లబండ్లు ను గ్రామం నుంచి ర్యాలీగా వెళ్లి గ్రామస్తులు అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లను ఆలయం చుట్టూ తిరగడం ఆకట్టుకుంది. మునుపెన్నడు లేని విధంగా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శకటోత్సవ కార్యక్రమంలో అర్చకులు పరాంకుశం యాదగిరి చార్యులు, వెంకటనారాయణ ప్రదీప్ చార్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు వివిధ గ్రామాల ప్రజలు భక్తులు పాల్గొన్నారు.
