contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుడ్‌ ఫ్రెండ్స్‌ చారిటీ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం

పిఠాపురం : పట్టణంలోని జగ్గయ్య చెరువులో నివసిస్తున్న మూగ, చెవుడు సమస్యలతో బాధపడుతున్న కేశబోయిన నవీనకు గుడ్‌ ఫ్రెండ్స్‌ చారిటీ వారు మన ఊరు మన బాధ్యత ఆధ్వర్యంలో ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. తనకు కడుపులో కణితి వుందని తెలిసి ఆపరేషన్‌ చేయించారని, అయితే అది విఫలమవ్వడంతో కడుపులో ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడి రోజురోజుకి నవీన బలహీనపడిపోతుండడంతో నవీన తల్లి వైద్యులను సంప్రదించగా మళ్ళీ ఆపరేషన్‌ చేయించమన్నారని ఆమె తల్లి తెలిపింది. పేదలకు సాహాయం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న గుడ్‌ ఫ్రెండ్స్‌ చారిటీ విషయం తెలుసుకుని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమెకు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించి, రూ.50వేలు ఆర్ధిక సహాయం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా గుడ్‌ ఫ్రెండ్స్‌ చారిటీ పలు సేవా కార్యక్రమాలు చేస్తుందని, మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఈ సంస్ధ ముందుకు వెలుతుందని మన ఊరు – మన బాధ్యత స్వచ్ఛంధ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్‌ తెలిపారు. అదే విధంగా పట్టణంలో కత్తులగూడెంకు చెందిన మొల్లి వీరబాబు (పండు) మార్చి 25వ తేదీ అకస్మిక మృతి చెందడంతో వారి కుటుంబం పోషణకు ఇబ్బంది పడుతుందని గుడ్‌ ఫ్రెండ్స్‌ చారిటీ సభ్యులకు తెలియడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేసి, ఆర్థిక సహాయం చేశారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె చంద్రిక వున్నారని తెలిపారు. ఈ సంధర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటి వరకూ పలు సేవా కార్యక్రమాలు తమ చారిటీ ద్వారా చేయడం జరిగిందని, తొలిసారి ఆర్థిక సహాయం చేశామన్నారు. మా సంస్థ ఇచ్చిన పిలుపుతో తమకు ఆర్థికంగా సహాయం చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా సంస్థ చారిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్‌ ఫ్రెండ్స్‌ చారిటీ సభ్యులు మేకా సూర్య ప్రకాష్‌, పి.నాగచక్రం, పి.ఆదిలక్ష్మి, కె.సుమ, దూలం వెంకటమాధురీ, కె.అంజనీ, ఆర్‌.కళ్యాణ్‌, బి.సురేష్‌, ఎస్‌.గణేష్‌, చాగంటి వీరబాబు, మన ఊరు మన బాధ్యత అధ్యక్ష, కార్యదర్శులు కొండేపూడి శంకరరావు, అల్లవరపు నగేష్‌, కౌన్సిలర్‌ రాయుడు శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :