పిఠాపురం : ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణ కూరగాయల మార్కెట్లో కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి 32వ దసరా మహోత్సవంలో భాగంగా భవానీల మంగళవారం రాత్రి పడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ విజయ దుర్గ అయ్యప్ప స్వామి వారి గానామృతం సంగీత స్వర్ణ నిధి నేషనల్ అవార్డు గ్రహీత రాజేష్ గురుస్వామిచే కోనసీమ జిల్లా చిరుతపూడి పడిపూజ ఉత్సాభరితంగా ఆటపాటలతో జరిగింది. ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో విశేషంగా కనకదుర్గ అమ్మవారి తాత్కాలిక ఆలయం నిర్మించారు. పెద్ద సంఖ్యలో భవాని మాల స్వీకరించిన భవానీ లందరూ, అయ్యప్ప మాల ధరించిన వారు ఈ పడి పూజలో పాల్గొన్నారు. దసరా సందర్భంగా 12వ తేదీ శనివారం రాత్రి కూరగాయల మార్కెట్లో సంబరం అంగరంగ వైభవంగా ఫుల్ బాండ్, సినీ ఆర్కెస్ట్రా, గరగ నృత్యాలు, శక్తి వేషాలు, అగ్నిగుండం తొక్కుట, తదితర సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.